ETV Bharat / business

టిక్​టాక్ నయా అవతారం- అమెరికాలో బ్యాన్​ నిలిపివేత - టిక్​టాక్ అమెరికా వ్యాపారాలపై ట్రంప్ కీలక ప్రకటన

చైనాకు చెందిన టిక్​టాక్ అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒరాకిల్, వాల్​మార్ట్ మధ్య కీలక ఒప్పందం కుదరనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందంతో టిక్​టాక్ సరికొత్త అమెరికా కంపెనీగా అవతరించనున్నట్లు తెలిపారు. ఇందుకు తమ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Trump on Tiktok Oracle deal
టిక్​టాక్​పై ట్రంప్ కీలక ప్రకటన
author img

By

Published : Sep 20, 2020, 11:59 AM IST

టిక్​టాక్ అమెరికా వ్యాపారాలను నిర్వహించేందుకు టెక్​దిగ్గజం ఒరాకిల్, రిటైల్ దిగ్గజం వాల్​మార్ట్​ మధ్య ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు తాము పూర్తి సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. టిక్​టాక్​ను ఆదివారం నుంచి అమెరికాలో నిషేధించాలని ఇటీవల ఆదేశాలు వెలువడిన తర్వాత ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఒప్పందం ఇలా..

ఈ ఒప్పందం ప్రకారం.. టిక్​టాక్ కార్యకలాపాలను నిర్వహించేందుకు టెక్సాస్​ కేంద్రంగా కొత్త కార్పొరేట్ సంస్థను నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ద్వారా దాదాపు 25 వేల కొత్త ఉద్యోగాల కల్పన కూడా జరగనున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా యువత విద్య కోసం టిక్​టాక్​ను​ 5 బిలియన్ డాలర్ల విరాళం కూడా కోరినట్లు పేర్కొన్నారు.

ఈ కంపెనీ డేటా స్టోరేజీకి ప్రత్యేక క్లౌడ్​ను వాడనున్నట్లు తెలిపారు ట్రంప్. దీనితో యూజర్ల డేటాకు 100 శాతం భద్రత ఉంటుందని భరోసా ఇచ్చారు.

కొత్త కంపెనీలో.. 53శాతం వాటాలు అమెరికాకు చెందిన వారికి.. 36శాతం వాటాలు చైనా పెట్టుబడిదారులకు చెందే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం బైట్‌డ్యాన్స్‌లో 40 శాతం వాటాలు అమెరికా మదుపర్ల చేతిలో ఉన్నాయి. బోర్డులో అమెరికాకు చెందిన డైరెక్టర్లే ఎక్కువగా ఉంటారని పేర్కొన్నారు. ఒక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌తో పాటు భద్రతా నిపుణులు కూడా బోర్డులో ఉంటారని తెలిపారు.

మరో ఏడాదిలో టిక్‌టాక్‌ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశం ఉంది.

బ్యాన్​ వాయిదా

ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో.. ఇటీవల టిక్​టాక్​ నిషేధానికి జారీ చేసిన ఆదేశాల గడువు పొడిగించింది అమెరికా వాణిజ్య విభాగం. ఇంతకు ముందు ఆదేశాల ప్రకారం ఆదివారం నుంచి టిక్​టాక్​ కొత్త డౌన్​లోడ్లను అమెరికాలో నిలిపియాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 27 వరకు పొడిగించింది.

ఇదీ చూడండి:శ్వేతసౌధంలో కలకలం.. ట్రంప్​కు పార్సిల్​లో విషం

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.