ETV Bharat / business

ఎగిరే కార్ల ఉత్పత్తికి టొయోటా భారీ పెట్టుబడులు - టొయోటా ఎగిరే కార్లు

ఎగిరే కార్ల కలను సాకారం చేసే దిశాగా వడివడిగా అడుగులు వేస్తోంది ప్రముఖ ఆటోమోబైల్ కంపెనీ టొయోటా. ఇందులో భాగంగా ఎగిరే ఎలక్ట్రిక్​ కార్ల వాణిజ్య ఉత్పత్తి కోసం 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

TOYOTA
ఎగిరే కార్లు
author img

By

Published : Jan 16, 2020, 8:51 PM IST

కార్ల తయారీ దిగ్గజం టొయోటా ఎగిరే ఎలక్ట్రిక్‌ కార్ల వాణిజ్య ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. వేగవంతమైన, సౌకర్యవంతమైన, అందుబాటు ధరల్లో గగనతల ప్రయాణం కోసం 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

గగనతల ప్రయాణం.. టొయోటా దీర్ఘకాలిక లక్ష్యమన్న ఆ సంస్థ అధ్యక్షుడు అకియో టొయోడా ఆటోమోబైల్‌ వ్యాపారం కొనసాగిస్తూనే, ఎగిరేకార్ల ఉత్పత్తిపై దృష్టిసారిస్తామన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా వినియోగదారులు భూమి మీదే కాకుండా నింగిలోనూ స్వేచ్ఛగా ఎగిరే అవకాశం కల్పిస్తామని టొయోటా వెల్లడించింది.

2009లో నాలుగు సీట్ల ఎలక్ట్రిక్ ఎయిర్‌ క్రాఫ్ట్​ను తయారు చేసిన టొయోటా వాటిని వ్యక్తులకు అమ్మే బదులుగా వాణిజ్య రవాణావ్యవస్థగా మలిచేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రపంచపు అతిచిన్న ఫ్లైయింగ్‌ కార్‌ తయారు చేసేందుకు జపనీస్‌ స్కైడ్రైవ్‌ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరిన టొయోటా ఇతర రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. హైడ్రోజెన్ ఫ్యూయల్ సెల్స్‌, స్వయం చాలిత వాహనాలు, స్మార్ట్‌ గృహాల నిర్మాణాల్లోనూ టొయోటా పెట్టుబడులు పెడుతోంది.

ఇదీ చూడండి:ఏజీఆర్​ రివ్యూ పిటిషన్​పై టెల్కోలకు సుప్రీం షాక్

New Delhi, Jan 16 (ANI): Prime Minister Narendra Modi addressed the international conclave on 'Globalising Indian Thought', at IIM Kozhikode via video-conferencing. Addressing the conclave, PM Modi said, "For centuries we have welcomed the world to our land. Our civilisation has prospered when many could not. Why? Because one finds peace and harmony here." He further added, "In a world seeking to break free from mindless hate, violence, conflict and terrorism, Indian way of life offers rays of hope. Indian way of conflict avoidance isn't by brute force but power of dialogue."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.