ETV Bharat / business

'ఏడాదిలోగా దేశంలోని టోల్​ ప్లాజాలకు స్వస్తి' - electronic payment

దేశంలో టోల్​బూత్​లు తొలగించి.. ఏడాదిలోనే జీపీఎస్​-ఆధారిత విధానాన్ని తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్​ గడ్కరీ. ఈ మేరకు లోక్​సభలో ప్రకటన చేశారు. ఇంకా.. వెహికిల్​ స్క్రాపింగ్​ పాలసీతో జీఎస్​టీ ఆదాయం పెరగడమే కాకుండా, కాలుష్యం తగ్గుతుందని, ఇంధన సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.

Toll booths to be removed,
'ఏడాదిలోగా దేశంలోని టోల్​ ప్లాజాలకు స్వస్తి'
author img

By

Published : Mar 18, 2021, 5:07 PM IST

ఏడాదిలోగా దేశంలో టోల్​బూత్​లన్నింటినీ తొలగించనున్నట్లు తెలిపారు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్​ గడ్కరీ. వాహనాల నుంచి టోల్​ వసూళ్లకు జీపీఎస్​- ఆధారిత​ విధానాన్ని అమలు చేస్తామని లోక్​సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వివరించారు.

93శాతం వాహనాలు ఫాస్టాగ్​ ద్వారానే టోల్​ చెల్లిస్తున్నట్లు పేర్కొన్న గడ్కరీ.. రెట్టింపు టోల్​ చెల్లిస్తున్న మిగిలిన 7శాతం వాహనాలు ఫాస్టాగ్​ను తీసుకోలేదన్నారు.

''దేశంలో సంవత్సరంలోగా అన్ని భౌతిక టోల్​ ప్లాజాలు తొలగిస్తామని సభాపూర్వకంగా తెలుపుతున్నా. అంటే.. టోల్​ వసూళ్లు జీపీఎస్​ ద్వారా జరుగుతాయి. వాహనాలపైన ఉండే జీపీఎస్​ ఇమేజింగ్​తో డబ్బులు వసూలు చేస్తాం.''

- నితిన్​ గడ్కరీ, కేంద్ర మంత్రి

ఫాస్టాగ్​ల ద్వారా టోల్​ చెల్లించని వాహనదారులపై పోలీసు విచారణకు ఆదేశించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. వాహనాలకు ఫాస్టాగ్స్‌ను అమర్చకపోతే టోల్ థెఫ్ట్(దొంగతనం), జీఎస్‌టీ ఎగవేత కింద కేసులు పెడతారని హెచ్చరించారు.

ఫాస్టాగ్​ అంటే..

టోల్​ ప్లాజాల వద్ద.. ఎలక్ట్రానిక్​ పేమెంట్​ విధానంలో టోల్​ ఫీజును చెల్లించేందుకు వీలుగా 2016లో ఫాస్టాగ్​ను తీసుకొచ్చింది కేంద్రం. ఇది లేని వాహనాలు.. ఎలక్ట్రానిక్ టోల్ ప్లాజాల వద్ద డబుల్ ఫీజు చెల్లించాలనే నిబంధన ఫిబ్రవరి 16 నుంచి అమల్లో ఉంది.

ఇదీ చూడండి: 'రెండేళ్లలో రూ.15లక్షల కోట్ల విలువైన రహదారులు'

వెహికిల్​ స్క్రాపింగ్​ పాలసీతో ప్రయోజనాలు..

వెహికిల్​ స్క్రాపింగ్​ పాలసీ(తుక్కు పథకం)పై లోక్​సభలో ప్రకటన చేశారు గడ్కరీ. ఈ విధానంతో ఇంధన సామర్థ్యం మెరుగుపడటమే కాకుండా.. పర్యావరణహిత వాహనాల సంఖ్య పెరిగి కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. కొత్త వాహనాల కొనుగోళ్లతో జీఎస్​టీ ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు కేంద్రమంత్రి.

ఈ విధానంతో.. వాహన రంగం టర్నోవర్​ ప్రస్తుతం ఉన్న రూ. 4.5 లక్షల కోట్ల నుంచి రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు గడ్కరి.

2022 ఏప్రిల్​ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశముందన్నారు.

ఐదు శాతం తగ్గింపు..

ఈ పథకం కింద పాత వాహనాలిచ్చి.. కొత్త కార్లు కొనాలనుకునేవారికి ధరలో 5శాతం మినహాయింపు ఉంటుందని నితిన్​ గడ్కరీ.. రాజ్యసభలో స్పష్టం చేశారు.

పాత, వినియోగానికి పనికిరాని వాహనాలను దశలవారీగా తగ్గించేందుకు వాలంటరీ 'స్క్రాపింగ్​ పాలసీ'ని బడ్జెట్​ సందర్భంగా ప్రకటించారు కేంద్ర ఆరోగ్యమంత్రి నిర్మలా సీతారామన్​. వ్యక్తిగత వాహనాలకు 20ఏళ్లు, వాణిజ్యపరమైన వాహనాలకు 15ఏళ్లు గడిచిన అనంతరం ఫిట్​నెస్​ పరీక్షలు జరిపించాలని స్పష్టం చేశారు. ఇది వాహన ఉత్పత్తి రంగానికి ఊతం అందిస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ''స్క్రాపింగ్​ పాలసీ'తో ఆటోమొబైల్​ రంగానికి ఊతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.