ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విద్యుత్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా'.. బిట్‌కాయిన్‌లో భారీగా పెట్టబడులు పెట్టింది. బిట్కాయిన్లలో దాదాపు 1.5 బిలియన్ డాలర్లు(దాదాపు 10,930 కోట్లు) కొనుగోలు చేసింది. త్వరలోనే తమ వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు డిజిటల్ చెల్లింపులను బిట్ కాయిన్ల రూపంలోనూ స్వీకరించనుందీ సంస్థ.
డిజిటల్ కరెన్సీ సహా ఇతర ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తమ పెట్టుబడులు పెరుగుతాయని.. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్‌కు టెస్లా సోమవారం తెలిపింది. ఈ నేపథ్యంలో బిట్‌కాయిన్ విలువ 15 శాతం పెరిగి, 43,863 డాలర్లకు చేరింది. టెస్లా షేర్ల విలువ కూడా పెరిగింది.
గత నెలలో నాల్గవ త్రైమాసిక ఆదాయ నివేదికలో టెస్లా వద్ద నగదు, నగదు సమానమైన 19.4 బిలియన్ డాలర్లు ఉన్నాయని ప్రకటించింది.