ETV Bharat / business

18 నుంచి టీసీఎస్‌ భారీ బైబ్యాక్‌ ఆఫర్

టాటా కన్సల్టెన్సీ సర్వీస్​(టీసీఎస్​) తన బైబ్యాక్​ ఆఫర్​ ప్రారంభ తేదీని ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమై జనవరి 1న ముగియనున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్​ విలువ రూ.16 వేల కోట్లుగా భావిస్తున్నారు.

author img

By

Published : Dec 10, 2020, 9:12 PM IST

TCS to open Rs 16,000 crore share buyback plan on Dec 18
18 నుంచి టీసీఎస్‌ భారీ బైబ్యాక్‌ ఆఫర్ ప్రారంభం!

దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్​(టీసీఎస్​) తన బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రారంభ తేదీని ప్రకటించింది. ఈ ఆఫర్‌ విలువ సుమారు రూ.16వేల కోట్లుగా భావిస్తున్నారు. ఇది డిసెంబర్‌ 18న మొదలై.. జనవరి 1వ తేదీన ముగియనుంది. గత నెల 5,33,33,333 వాటాలను బైబ్యాక్‌ చేసేందుకు టీసీఎస్‌ వాటాదారులు అనుమతి మంజూరు చేశారు. ఒక్కోషేరు రూ.3,000 చొప్పున కొనుగోలు చేయనున్నారు. "సెబీ బైబ్యాక్‌ నిబంధనలు-2018 ప్రకారం ఆఫర్‌ లెటర్‌ను అర్హులైన వాటాదారులకు పంపించనున్నాం. ఈ ప్రక్రియ డిసెంబర్‌ 15 కంటే ముందే పూర్తవుతుంది" అని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టీసీఎస్ పేర్కొంది.

ఈ రెగ్యులేటరీ ఫైలింగ్‌లోనే బైబ్యాక్‌కు సంబంధించిన ఇతర కీలక వివరాలను కూడా వెల్లడించింది. ఆఫర్‌ 18న ప్రారంభమవుతుందని తెలిపింది. జనవరి 1వ తేదీ దీనికి తుది గడువుగా పేర్కొంది. స్టాక్‌ఎక్స్‌ఛేంజిల్లో దీనికి సంబంధించిన బిడ్స్‌ పరిష్కారానికి తుదిగడవు జనవరి 12గా ప్రకటించింది. వాటాదారులకు మూలధనాన్ని తిరిగి ఇవ్వాలనే కంపెనీ పాలసీకి అనుగుణంగానే ఈ బైబ్యాక్‌ చేపట్టినట్లు టీసీఎస్‌ సీఈవో, ఎండీ రాజేష్‌ గోపీనాథన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం టీసీఎస్‌ వద్ద సెప్టెంబర్‌ నాటికి రూ.58,500 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. గతంలో ఓ సారి బోనస్‌ ప్రకటించిన టీసీఎస్‌ ఈ సారి బైబ్యాక్‌ మార్గాన్ని ఎంచుకొంది.

ఇదీ చూడండి: భారీగా తగ్గిన బంగారం ధర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.