ETV Bharat / business

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థ టీసీఎస్‌ - ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థ టీసీఎస్‌

దేశీయ టెక్​ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(టీసీఎస్​).. యాక్సెంచర్‌ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా అవతరించింది. గురువారం టీసీఎస్​ షేరు దూకుడుతో సంస్థ మార్కెట్​ విలువ రూ.10.59 లక్షలకోట్లు దాటింది.

TCS
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థ టీసీఎస్‌
author img

By

Published : Oct 9, 2020, 5:51 AM IST

టీసీఎస్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా అవతరించింది. యాక్సెంచర్‌ను వెనక్కినెట్టి ఈ ఘనత సాధించింది. గురువారం టీసీఎస్‌ షేరు దూకుడుతో సంస్థ మార్కెట్‌ విలువ రూ.10,59,973.63 కోట్లకు చేరింది. డాలర్లలో ఈ విలువ 144.73 బిలియన్‌ డాలర్లు.

ప్రస్తుతం యాక్సెంచర్‌ మార్కెట్‌ విలువ 142.4 బి.డాలర్లుగా ఉంది. దీంతో మార్కెట్‌ విలువపరంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో టీసీఎస్‌ అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. యాక్సెంచర్‌ రెండో స్థానానికి దిగివచ్చింది. 110.5 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువతో ఐబీఎం మూడో స్థానంలో ఉంది.

ఇదీ చూడండి: 16 వేల కోట్ల బై బ్యాక్ ప్లాన్​కు టీసీఎస్​ బోర్డు ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.