దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు సిద్ధమైంది. 16 వేల కోట్ల రూపాయల బైబ్యాక్ ప్రణాళికకు టీసీఎస్ బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో బైబ్యాక్ ఈక్వీటీ షేరు విలువ రూ.3 వేలుగా అంగీకారం తెలిపింది.
మొత్తం 5.33 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను టీసీఎస్ ఆమోదించింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో బుధవారం టీసీఎస్ షేర్ల ముగింపు ధర కంటే ఇది 9 శాతం ఎక్కువ. బీఎస్ఈలో ప్రస్తుతం టీసీఎస్ షేర్ విలువ రూ.2,737.4 గా ఉంది.
రెండో త్రైమాసికంలో టీసీఎస్ ఏకీకృత నికర లాభం 4.9 శాతం పెరిగి రూ.8,433 కోట్లకు చేరింది. గతేడాదితో పోలిస్తే రెండో త్రైమాసికంలో టీసీఎస్ ఆదాయం 3 శాతం.. అంటే రూ.38,977 కోట్ల నుంచి రూ.40,135 కోట్లకు పెరిగింది.
ఇదీ చూడండి: రిలయన్స్‌లోకి మరో రూ.5,512కోట్ల పెట్టుబడులు