ETV Bharat / business

ప్రపంచంలోనే మూడో విలువైన ఐటీ బ్రాండ్​గా 'టీసీఎస్'​ - బ్రాండ్​ విలువ పరంగా అతిపెద్ద ఐటీ కంపెనీ

బ్రాండ్ విలువ పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఐటీ సంస్థగా టీసీఎస్​ అవతరించింది. బ్రాండ్ ఫినాన్స్ విడుదల చేసిన ఈ జాబితాలో ఐటీ దిగ్గజాలైన యాక్సెంచర్, ఐబీఎంలు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇందులో టాప్​ 10 ఐటీ కంపెనీల్లో భారతీయ సంస్థలే నాలుగు ఉండటం మరో విశేషం.

TCS brand Value hit new record
టీసీఎస్​ బ్రాండ్​ విలువ కొత్త రికార్డు
author img

By

Published : Jan 27, 2021, 5:53 PM IST

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్​) మరో ఘనత సాధించింది. బ్రాండ్​ విలువ పరంగా ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సంస్థల్లో మూడో ర్యాంకును దక్కించుకుంది.

'బ్రాండ్​ విలువ 11 శాతం వృద్ధితో 15 బిలియన్​లు డాలర్లకు చేరడం వల్ల ఐబీఎంతో పోలిస్తే స్వల్ప తేడాతో మూడో స్థానంలో నిలిచింది టీసీఎస్.' అని 'గ్లోబల్​ 500-2021' పేరుతో బ్రాండ్​ ఫినాన్స్ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

ఈ జాబితాలో 26 బిలియన్​ డాలర్ల బ్రాండ్ విలువతో యాక్సెంచర్​ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఐబీఎం 16.1 బిలియన్​ డాలర్ల బ్రాండ్ విలువతో రెండో స్థానాన్ని కొనసాగించింది.

'బ్రాండ్​ వ్యాల్యూ' అనేది ప్రస్తుత ఆదాయాల విలువను సూచిస్తుందని పేర్కొంది బ్రాండ్​ ఫినాన్స్.

దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్, విప్రోలు కూడా ప్రపంచవ్యాప్తంగా టాప్​ 10 ఐటీ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. ఈ సంస్థలన్నీ వేగంగా వృద్ధి చెందుతున్నట్లు నివేదిక వివరించింది.

ఇతర సంస్థల ర్యాంకులు

కాగ్నిజెంట్​ను దాటి ఇన్ఫోసిస్ 4వ స్థానానికి చేరింది. ఇన్ఫీ బ్రాండ్​ వ్యాల్యూ 19 శాతం వృద్ధితో 8.4 బిలియన్​ డాలర్లకు ఎగబాకింది.

హెచ్​సీఎల్​ టెక్​ 7వ స్థానాన్ని దక్కించుకుంది. విప్రో 9వ స్థానంలో ఉంది. టెక్ మహీంద్రా 11వ స్థానంతో సరిపెట్టుకుంది.

ఇదీ చూడండి:భారత్​లో కార్యకలాపాలకు 'టిక్​టాక్'​ గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.