ప్రైవేటు రంగ స్టీల్ ఉత్పత్తి దిగ్గజం 'టాటా స్టీల్' ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2020-21కి గానూ వార్షిక బోనస్ కింద రూ.270.28 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. టాటా స్టీల్లోని అన్ని విభాగాలు, యూనిట్లలోని అర్హులైన ఉద్యోగులందరికీ ఈ బోనస్ వర్తిస్తుందని పేర్కొంది.
దీనికి సంబంధించి టాటా స్టీల్, టాటా వర్కర్స్ యూనియన్ మధ్య బుధవారమే సెటిల్మెంట్ ఒప్పందం కుదిరింది. ఇదే కాకుండా.. జంషెట్పుర్లోని ట్యూబ్స్ సహా వేర్వేరు డివిజన్లు రూ.158.31 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.
అర్హులైన ఉద్యోగులకు బోనస్ సగటు కనీసం రూ.34,920గా ఉండగా.. గరిష్ఠంగా రూ.3,59,029గా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఇదీ చదవండి: JAMSETJI TATA: దాతృత్వంలో జెంషెట్ జీ టాటాదే అగ్రస్థానం!