ETV Bharat / business

ఐఫోన్ల విక్రయాలతో 3 నెలల్లో రూ.3 లక్షల కోట్ల ఆదాయం!

author img

By

Published : Jul 28, 2021, 1:20 PM IST

ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్​ ఆదాయం ఏప్రిల్​-జూన్ త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని (36%) సాధించింది. గడిచిన మూడు నెలల్లో ఐఫోన్ల విక్రయం ద్వారానే 39.5 బిలియన్ డాలర్ల (రూ.2.9 లక్షల కోట్ల పైమాటే) ఆదాయాన్ని నమోదు చేసింది.

Apple iPhones
యాపిల్​ ఐఫోన్లు

లగ్జరీ గాడ్జెట్స్ తయారీ సంస్థ యాపిల్​ ఈ ఏడాది ఏప్రిల్​-జూన్ త్రైమాసికంలో 81.4 బిలియన్ డాలర్ల (రూ.6.05 లక్షల కోట్లు) ఆదాయాన్ని గడించింది. 2020 ఇదే సమయంలో సంస్థ ఆదాయం 56.9 బిలియన్​ డాలర్లుగా ఉంది.

గడిచిన మూడు నెలల కాలంలో సంస్థ నికర ఆదాయం 21.7 బిలియన్ డాలర్లు(రూ.1.6 లక్షల కోట్లు)గా నమోదవగా.. గత ఏడాది ఇదే సమయంలో ఈ మొత్తం 11.2 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది యాపిల్​.

మొత్తం ఆదాయంలో ఐఫోన్ల వాటానే.. 39.5 బిలియన్​ డాలర్లని(రూ.2.9 లక్షల కోట్ల పైమాటే) యాపిల్​ పేర్కొంది.

అన్ని విభాగాల్లో, అన్ని మార్కెట్లలోను కంపెనీ మంచి ప్రదర్శన కనబర్చి.. రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని యాపిల్ సీఈఓ టిమ్​ కుక్​ పేర్కొన్నారు. కొత్తగా పుంజుకుంటున్న మార్కెట్లలోనూ.. యాపిల్ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్​ పెరిగినట్లు చెప్పారు.

మరిన్ని వివరాలు..

ఏప్రిల్​-జూన్​ త్రైమాసిక ఆదాయంలో (81.4 బిలియన్​ డాలర్ల) అమెరికా వాటానే 35.8 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. ఐరోపా మార్కెట్ నుంచి 18.9 బిలియన్ డాలర్లు గడించింది యాపిల్​. చైనా మార్కెట్లో 14.7 బిలియన్ డాలర్లు, జపాన్​లో 6.4 బిలియన్​ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఆసియా ప్రాంతంలోని మిగతా మార్కెట్ల నుంచి 5.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది​.

ఇదీ చదవండి:ఏ వస్తువుకు ఎంత ధర? కంపెనీల ఇష్టమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.