అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలతో స్టాక్ మార్కెట్లలో నేడూ నష్టాల మోత కొనసాగుతోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ప్రస్తుతం 260 పాయింట్లు కోల్పోయి.. 38,015 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 80 పాయింట్ల నష్టానికి 11,415 వద్ద కొనసాగుతోంది.
ఇవీ కారణాలు
అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదం పరిష్కారానికి ప్రయత్నాలు ఇంకా మొదలు కాలేదు. ఈ కారణంగా యుద్ధ భయాలు మదుపర్లను బెంబేలెత్తిస్తున్నాయని అంటున్నారు నిపుణులు.
బ్యాంకింగ్, ఇతర వినియోగ రంగ సంస్థల ఫలితాలపై అంచనాలు తప్పడం మార్కెట్ల నష్టాలకు మరో కారణం.
లాభానష్టాల్లోనివే
సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్‌టెక్, ఐసీఐసీఐ బ్యాంకు, కోల్ ఇండియా, ఇండస్ఇండ్బ్యాంకు, సన్ ఫార్మా షేర్లు ప్రధానంగా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
వేదాంత, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, బజాజ్ ఫినాన్స్, ఎస్బీఐ షేర్లు సహా ఆటోమొబైల్, ఆర్థిక రంగ షేర్లు అధికంగా నష్టాల్లో సాగుతున్నాయి.
రూపాయి, ముడి చమురు
నేడు ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 20 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.62 వద్ద ట్రేడవుతోంది.
ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ 0.44 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 70.19 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఇతర మార్కెట్లు ఇలా
ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు షాంఘై సూచీ, హాంకాంగ్ సూచీ-హంగ్ సెంగ్, జపాన్ సూచీ-నిక్కీ, దక్షిణ కొరియా సూచీ-కోస్పీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా దాదాపు అన్ని ప్రధాన మార్కెట్లపై అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు అలుముకున్నాయి.