స్టాక్ మార్కెట్లు ఆరంభంలో లాభాలతో ప్రారంభమైనా.. మదుపరుల అప్రమత్తతతో కొద్దిసేపటికే సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. మెల్లగా నష్టాల్లోకి జారుకున్నాయి.
డిసెంబర్ డెరివేటివ్స్ గడువు ముగింపు దగ్గరపడుతుండటం ఒడుదొడుకులకు కారణంగా తెలుస్తోంది. విదేశీ మదుపరులు సంవత్సరాంతపు సెలవుల్లో గడుపుతుండటమూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపుతున్నట్లు స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 2 పాయింట్ల లాభంతో.. ప్రస్తుతం 41,463 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 2 పాయింట్లకు పైగా క్షీణించి.. 12,212 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
ఎం&ఎం, నెస్లే, టాటా స్టీల్, హీరో మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్ నష్టాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి:'బకాయిలు వెంటనే చెల్లించి.. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్'