స్టాక్ మార్కెట్ల లాభాల పరంపరకు నేడు అడ్డుకట్టపడింది. ఇటీవల నమోదైన రికార్డు స్థాయి లాభాల నేపథ్యంలో.. మదుపరులు వాటిని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఈ కారణంగా స్వల్ప నష్టాలను నమోదు చేశాయి సూచీలు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 54 పాయింట్లు నష్టపోయింది. చివరకు 40వేల 248 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి..11వేల 917 వద్ద నిలిచింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,466 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. 40,053 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ 11,979 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,862 పాయింట్ల అత్యల్ప స్థాయి మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
ఎస్ బ్యాంకు అత్యధికంగా 3.40 శాతం, బజాజ్ ఫినాన్స్ 2.77 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.84 శాతం, ఎస్బీఐ 1.59 శాతం, బజాజ్ ఆటో 1.39 శాతం లాభాలను నమోదు చేశాయి.
ఇండస్ఇండ్ బ్యాంకు 2.40 శాతం, సన్‌ఫార్మా 2.02 శాతం, ఇన్ఫోసిస్ 1.86 శాతం, టాటా స్టీల్ 1.26 శాతం, ఎం&ఎం 1.21 శాతం నష్టపోయాయి.
ఇదీ చూడండి: లోగో మార్చిన ఫేస్బుక్.. ఎందుకో తెలుసా?