వారాంతంలో అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. వృద్ధి మందగమనం, ఆర్థిక మాంద్యం భయాలతో అమ్మకాలవైపే మొగ్గు చూపుతున్నారు మదుపరులు. బ్యాంకింగ్ రంగ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 314 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 36, 159 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 88 పాయింట్ల నష్టంతో 10,655 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
ఇన్ఫోసిస్, ఎస్బ్యాంకు, టాటా మోటార్స్, టీసీఎస్, వేదాంత, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్ షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఐసీఐసీఐ బ్యాంకు, మారుతీ, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.