దేశంలో వినియోగానికి ఆమోదం పొందిన మూడో వ్యాక్సిన్.. 'స్పుత్నిక్-వి'ని జూన్ రెండో వారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అపోలో గ్రూప్ ప్రకటించింది. ఈ టీకా ధరను ఒక డోసుకు రూ.1,195గా నిర్ణయించింది.
"స్పుత్నిక్-వి టీకా ఛార్జీ డోసుకు రూ.995గా నిర్ణయించాం. రూ.200 నిర్వహణ ఛార్జీలు."
- అపోలో గ్రూప్
మిలియన్ మైలురాయి..
ఇప్పటి వరకు పది లక్షల కొవిడ్ వ్యాక్సిన్ల మైలురాయిని అధిగమించినట్లు అపోలో ఆసుపత్రుల గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్‌పర్సన్ శోభన కామినేని తెలిపారు. దేశవ్యాప్తంగా 80 వేర్వేరు ప్రదేశాల్లో ఫ్రంట్‌లైన్ వర్కర్లు, అధిక రిస్క్ ఉన్న వ్యక్తులు, కార్పొరేట్ ఉద్యోగులకు టీకాల్లో ప్రాధాన్యమిచ్చినట్లు వివరించారు.
"జూన్‌లో ప్రతివారం 10 లక్షల టీకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జులైలో దీన్ని రెట్టింపు చేస్తాం. 2021 సెప్టెంబరు నాటికి 2 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వడమే లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా తయారీదారులు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు" -శోభన కామినేని
ఇదీ చదవండి:covaxin: భారత్ బయోటెక్‌తో జీసీవీసీ ఒప్పందం