వ్యాక్సిన్ తయారీదారులకు నిరంతరాయంగా సేవలందించేందుకు ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్కార్గొ (జీహెచ్ఏసీ)తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో స్పైస్‌జెట్‌కు చెందిన కార్గొ సేవల విభాగం స్పైస్ ఎక్స్‌ప్రెస్ వ్యాక్సిన్‌ను వేగంగా రవాణా చేసేందుకు అవాకాశం దొరకుతుంది. దీనితో పాటే స్థిరమైన కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌ను కూడా ఏర్పాటు చేయనుంది స్పైస్‌జెట్.
వ్యాక్సిన్‌ను లోడ్ చేసినప్పటి నుంచి డెలవరీ చేసే వరకు.. అన్ని దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు నియంత్రిత ఉష్ణోగ్రతలో (వ్యాక్సిన్ సురక్షితంగా ఉండేందుకు కావాల్సిన ఉష్టోగ్రత) రవాణా చేయడమే తమ లక్ష్యమని స్పైస్ జెట్ పేర్కొంది.
స్పైస్ జెట్ విమానాలకు కావాల్సిన స్థలం అందుబాటులో ఉంచడం సహా.. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా స్పందించేందుకు తమ సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వనుంది.
ఇదీ చూడండి:వరుసగా 15వ ఏటా టీవీల రారాజుగా శాంసంగ్!