ETV Bharat / business

6 రోజుల్లో 7 కంపెనీల నష్టం రూ.1.89 లక్షల కోట్లు

బడ్జెట్ ప్రతికూల అంచనాలతో స్టాక్ మార్కెట్లు గత వారం భారీగా నష్టపోయాయి. ఈ కారణంగా దేశంలో 10 దిగ్గజ కంపెనీల్లో ఏడింటికి వారం రోజుల్లో రూ.1,89 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.

MCAP
7 కంపెనీల నష్టం రూ.1.89 లక్షల కోట్లు
author img

By

Published : Feb 2, 2020, 12:59 PM IST

Updated : Feb 28, 2020, 9:21 PM IST

కేంద్ర పద్దుపై అంచనాలతో స్టాక్ మార్కెట్లు గత వారం భారీ ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. వారం రోజుల్లో మొత్తం 1,877 పాయింట్లు నష్టపోయింది బీఎస్​ఈ-సెన్సెక్స్. బడ్జెట్​ నేపథ్యంలో ఒక్క చివరి సెషన్​లోనే 987 పాయింట్లు కోల్పోయింది.

గత వారం నష్టాలతో మార్కెట్​ క్యాపిటలైజేషన్(ఎం క్యాప్​) పరంగా 10 అత్యంత విలువై కంపెనీల్లో ఏడింటకి రూ.1.89 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్​ అత్యధికంగా రూ.87,732.8 కోట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఈ సంస్థ ఎం క్యాప్​ రూ.8,76,906.57 కోట్లుగా ఉంది.

ఇతర కంపెనీల నష్టాలు (గత వారం) ఇలా..

కంపెనీ నష్టం రూ.కోట్లలో ప్రస్తుతం ఎం క్యాప్​ రూ.కోట్లలో
హెచ్​డీఎఫ్​సీ 31,148.4 3,92,618.14
హెచ్​డీఎఫ్​సీబ్యాంక్ 24,736 6,56,888.50
ఐసీఐసీఐ బ్యాంక్ 19,044.7 3,26,410.37
ఎస్​బీఐ 18,652.4 2,70,549.60
టీసీఎస్ 7,317.15 8,12,428.81
ఇన్ఫోసిస్ 1,149.83 3,32,280.10

10లో మూడు కంపెనీల లాభం(గత వారం)..

కంపెనీ లాభం రూ.కోట్లలో ప్రస్తుత ఎంక్యాప్​ రూ.కోట్లలో
భారతీ ఎయిర్​టెల్ 2,392.15 2,71,332.15
కోటక్​ బ్యాంక్​ 1,182.02 3,15,346.61
హెచ్​యూఎల్​ 119.07 4,48,895.43

గత వారం భారీ నష్టాన్ని మూటగట్టుకున్నప్పటికీ పది దిగ్గజ సంస్థల్లో పూర్తి ఎంక్యాప్​ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్​ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంల్లో టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ, ఇన్ఫోసిస్​, ఐసీఐసీఐ బ్యాంక్​, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐలు ఉన్నాయి.

ఇదీ చూడండి:బడ్జెట్​ 2020: సామాన్యులపై ప్రభావం ఎంత?

Last Updated : Feb 28, 2020, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.