ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఔషధాన్ని కనుగొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత్‌కు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేసింది. 2022 నాటికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.
మానవుడిపై పరీక్ష
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కోడాజెనిక్స్‌తో కలిసి పుణెలో ఉన్న ఎస్ఐఐ కృషి చేస్తోంది. మరో ఆరు నెలల్లో మానవుడిపై ఈ వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహించే అవకాశముందని ఈ సంస్థ పేర్కొంది.
రూ.300 కోట్లతో ప్రాజెక్టు
మానవాళికి ముప్పుగా మారిన కరోనా వైరస్ సోకి ఇప్పటికే వేలాది మంది మరణించారు. వైరస్ సోకకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. అందుకోసమే వ్యాక్సిన్ తయారీపై దృష్టి సారించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. రూ.300 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్.
ఇదీ చూడండి:విమానాల్లో క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం.. ఎప్పట్నుంచో తెలుసా?