ETV Bharat / business

స్టాక్ మార్కెట్లు: కరోనా భయాలున్నా లాభాలే - స్టాక్ మార్కెట్లు లేటెస్ట్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయాలున్నా దేశీయ స్టాక్​ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెషన్ ప్రారంభంలో 400 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్​ చివరకు 236 పాయింట్ల వృద్ధితో ముగిసింది. నిఫ్టీ నేడు 76 పాయింట్లు బలపడింది.

STOCK MARKETS
సెన్సెక్స్ భారీ లాభం
author img

By

Published : Feb 11, 2020, 4:08 PM IST

Updated : Mar 1, 2020, 12:08 AM IST

స్టాక్​ మార్కెట్లు నేడు నష్టాల నుంచి తేరుకున్నాయి. కరోనా భయాలతో గత సెషన్​లో నష్టాలను నమోదు చేసిన సూచీలు.. నేడు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతుండటం దేశీయంగా సానుకూలతలు పెంచింది. అయితే కరోనా భయాలతో ఇంకా కొన్ని రోజులు మార్కెట్లలో అప్రమత్తత కొనసాగే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 236 పాయింట్ల వృద్ధితో 41,216 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 76 పాయింట్లు బలపడి.. 12,108 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,444 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,179 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,172 పాయింట్ల అత్యధిక స్థాయి, 12,099 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివివే..

ఎన్​టీపీసీ 2.95 శాతం, మారుతీ 2.07 శాతం, ఎస్​బీఐ 1.84 శాతం, పవర్​గ్రిడ్​ 1.53 శాతం, బజాజ్ ఆటో 1.35 శాతం, ఆల్ట్రాటెక్​ సిమెంట్ 1.34 శాతం లాభపడ్డాయి.

భారతీ ఎయిర్​టెల్​ 0.75 శాతం, ఎం&ఎం 0.69 శాతం, నెస్లే 0.61 శాతం, టీసీఎస్​ 0.52 శాతం, సన్​ఫార్మా 0.39 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి:ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఇబ్బందుల్లో లేదు: నిర్మల

Last Updated : Mar 1, 2020, 12:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.