స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరిచన నేపథ్యంలో.. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముందనే వార్తలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ప్రధానంగా మైనింగ్, బ్యాంకింగ్, ఐటీ రంగ షేర్లు లాభాలకు ఊతమిచ్చాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 281 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 37,385 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో 11,076 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 37,413 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,000 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,084 పాయింట్ల అత్యధిక స్థాయి.. 10,946 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
వేదాంత 2.72 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 2.61 శాతం, ఓఎన్జీసీ 2.34 శాతం, కోటక్ బ్యాంకు 1.79 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.74 శాతం, ఎస్బీఐ 1.69 శాతం లాభాలను నమోదుచేశాయి.
భారతీ ఎయిర్టెల్ 1.35 శాతం, సన్‌ఫార్మా 1.04 శాతం, హెచ్డీఎఫ్సీ 0.62 శాతం, ఐటీసీ 0.35 శాతం, హెచ్‌యూఎల్ 0.10 శాతం నష్టాలతో ముగిశాయి.
ఇదీ చూడండి: త్వరలోనే చిన్న పట్టణాలకు 'ఓలా' బైక్ సేవలు