స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. వృద్ధి మందగనమం భయాలు, వాహన రంగ సంక్షోభం ఆర్థిక మాంద్యం భయాలు నేటి నష్టాలకు ప్రధాన కారణం. దాదాపు అన్ని రంగాలు నేడు నష్టాలతోనే ముగిశాయి. ఆర్థిక రంగ షేర్లు భారీగా కుదేలయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ- సెన్సెక్స్ 587 పాయింట్లు కోల్పోయింది. చివరకు 36,473 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 10,738 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 37,089 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 36,391 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 10,908 పాయింట్ల అత్యధిక స్థాయి.. 10,718 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టెక్ మహీంద్రా 1.57 శాతం, టీసీఎస్ 1.33 శాతం, హెచ్‌యూఎల్ 1.03 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 0.58 శాతం లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ నాలుగు సంస్థలు మాత్రమే లాభాలు నమోదు చేశాయి.
మొండి రుణాల కారణంగా ఎస్ బ్యాంకు అత్యధికంగా 13.91 శాతం నష్టపోయింది. వేదాంత 7.76 శాతం, బజాజ్ ఫినాన్స్ 4.39 శాతం, టాటా మోటార్స్ 3.70 శాతం,ఓఎన్జీసీ 3.55 శాతం, ఎస్బీఐ 3.24 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇదీ చూడండి: క్లెయింలో చిక్కులను పరిష్కరించుకోండిలా..