స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. అమెరికా వీసా విధానాల మార్పు ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఫలితంగా ఐటీ రంగ షేర్లు నేడు కుదేలయ్యాయి. వీటికి తోడు బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి నేటి నష్టాలకు ప్రధాన కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 216 పాయింట్లు కోల్పోయింది.. చివరకు 40,359 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 54 పాయింట్ల నష్టంతో..11,914 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,653 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,277 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,968 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,883 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టాటా స్టీల్ 3.74 శాతం, ఎన్టీపీసీ 2.35 శాతం, వేదాంత 2.27 శాతం, ఓఎన్జీసీ 2.14 శాతం, పవర్ గ్రిడ్ 1.53 శాతం, హెచ్డీఎఫ్సీ 1.14 శాతం లాభాలను గడించాయి.
ఇన్ఫోసిస్ 2.89 శాతం, టీసీఎస్ 2.20 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.17 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 1.82 శాతం, కోటక్ బ్యాంకు 1.68 శాతం నష్టాలను నమోదు చేశాయి.
రూపాయి, ముడి చమురు
రూపాయి నేడు స్వల్పంగా క్షీణించింది. డాలర్‌తో మారకం విలువ 71.79కి చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.03 శాతం తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర 63.95 డాలర్లకు చేరింది.
ఇతర మార్కెట్లు ఇలా..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లయిన.. షాంఘై సూచీ మినహా.. టోక్యో, హాంకాంగ్, సియోల్ సూచీలూ నేడు లాభాలతో ముగిశాయి.
ఇదీ చూడండి:'ఉపసంహరణ' ద్వారా 'ప్రైవేటీకరణ'పై ప్రయోగం!