ETV Bharat / business

భయపెట్టిన వృద్ధి అంచనాలు.. కోలుకోని సూచీలు

వరుసగా ఐదో రోజూ నష్టాలను నమోదు చేశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 135 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 63 పాయింట్లు తగ్గింది.

సెన్సెక్స్
author img

By

Published : Jul 24, 2019, 4:07 PM IST

దేశీయంగా వృద్ధి తగ్గుతుందని పేర్కొన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాలతో స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకింగ్, వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 135 పాయింట్లు క్షీణించింది. చివరకు 37,848 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 11,271 వద్ద ముగిసింది.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్​ 38,103 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,708 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,360 పాయింట్ల అత్యధిక స్థాయి, 11,230 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఏషియన్ పెయింట్స్ 3.42 శాతం, హెచ్​యూఎల్ 2.06 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.84 శాతం, హెచ్​సీఎల్​ 0.95 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు 0.70 శాతం లాభపడ్డాయి.

ఇండస్ఇండ్ బ్యాంకు 3.50 శాతం, బజాజ్ ఫినాన్స్ 3.17 శాతం, టాటా మోటార్స్ 3.17 శాతం, టాటా స్టీల్ 3.06 శాతం, హీరో మోటార్స్ 2.63 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.26 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి: దేశంలో నల్లధనం ఎంతో తెలీదు: కేంద్రం

Intro:Body:

y

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.