స్టాక్ మార్కెట్లు నేడు ఒడుదొడుకుల మధ్య సాగుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌పై సానుకూల అంచనాలతో చివరి సెషన్లో కాస్త తేరుకున్నట్లు కనిపించినా.. కరోనా ఆందోళనలు అంతకంతకూ పెరుగుతుండటం నేటి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 176 పాయింట్లకు పైగా నష్టంతో.. 41,021 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 45 పాయింట్లకు పైగా క్షీణతతో 12,084 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి..
ఎన్టీపీసీ, టీసీఎస్, పవర్ గ్రిడ్, హీరో మోటోకార్ప్, హెచ్‌సీఎల్‌టెక్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, నెస్లే, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి:ఆర్థికమంత్రి ముందున్న సవాల్.. వృద్ధిరేట్లకు ఊతమెలా?