గడిచిన ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నికర లాభం 4 రెట్లు పెరిగింది. జనవరి-మార్చి మధ్య మూడు నెలల కాలంలో రూ.3,580.81 కోట్లు గడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2018-19) ఇదే సమయంలో బ్యాంక్ నికర లాభం రూ.838.4 కోట్లుగా ఉంది.
2019-20 జవవరి-మార్చి త్రైమాసికంలో ఎస్బీఐ ఆదాయం కూడా భారీగా రూ.76,027.51 కోట్లకు పెరిగింది. 2018-19 ఇదే సమయంలో బ్యాంక్ ఆదాయం రూ.75,650.5 కోట్లుగా ఉంది.
ఎన్పీఏలు ఇలా..
గ్రాస్ ఎన్పీఏలు 2020 మార్చి 31 నాటికి గత ఏడాడి ఇదే సమయంతో పోలిస్తే 7.53 శాతం నుంచి 6.15 శాతానికి మెరుగయ్యాయని ఎస్బీఐ ప్రకటించింది. నికర ఎన్పీఏలు (మొండి బకాయిలు) కూడా 2019 మార్చి 31తో పోలిస్తే.. 2020 మార్చి 31 నాటికి 3.01 శాతం నుంచి 2.23 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:ఇప్పట్లో ప్రభుత్వం నుంచి కొత్త పథకాలు ఉండవు!