ETV Bharat / business

కార్డుల వ్యాపారంలో వాటా తగ్గింపు దిశగా ఎస్​బీఐ - ఎస్​బీఐ

ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్​ ద్వారా ఎస్​బీఐ కార్డులు, పేమెంట్స్ వ్యాపారంలో తమ వాటాను తగ్గించుకోనున్నట్లు భారతీయ స్టేట్ బ్యాంక్​ ప్రకటించింది. ఆర్బీఐ సహా ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన తర్వాత 'ఐపీఓ' తేదీని వెల్లడించనుంది ఎస్​బీఐ.

ఎస్​బీఐ
author img

By

Published : Aug 14, 2019, 6:42 PM IST

Updated : Sep 27, 2019, 12:33 AM IST

కార్డుల వ్యాపారాల్లో వాటాను తగ్గించుకునే దిశగా భారతీయ స్టేట్ బ్యాంకు అడుగులు వేస్తోంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్​ (ఐపీఓ) మార్గంలో తమ వాటాను తగ్గించుకోనున్నట్లు ఎస్​బీఐ వెల్లడించింది.

'ఎస్​బీఐ కార్డ్స్​​, పేమెంట్స్​ సర్వీసెస్​​ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థలో 74 శాతం వాటా ప్రస్తుతం ఎస్​బీఐ చేతిలో ఉంది.

వాటను తగ్గించుకునేందుకు ఎస్​బీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ తాజా సమావేశంలో ప్రాథమిక అమోదం లభించింది. వాటా తగ్గింపునకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని కమిటీ సూచించింది.

ఎస్​బీఐ ప్రతిపాదించిన ఈ 'ఐపీఓ'కు రిజర్వు బ్యాంకు సహా ఇతర నియంత్రణ సంస్థలు అమోదం లభించాల్సి ఉంది.
తుది అనుమతులు లభించిన తర్వాత 'ఐపీఓ' తేదీని ప్రకటిస్తామని ఎస్​బీఐ పేర్కొంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనే 'ఐపీఓ' ఉండొచ్చని ఎస్​బీఐ ఛైర్మన్​ రజనీశ్​ కుమార్​ ఇటీవల తెలిపారు.

ఎస్​బీఐ కార్డుల వ్యాపార ప్రస్థానం

  • 1998 డిసెంబర్​లో ఎస్​బీఐ కార్డులు అందుబాటులోకి వచ్చాయి.
  • తొలుత వీటి కార్యకలాపాలు 'జీఈ క్యాపిటల్' సంస్థ నిర్వహించేది.
  • 2017 డిసెంబర్​లో ఎస్​బీఐ, 'కార్లెల్​ గ్రూపు'లు సంయుక్తంగా 'జీఈ గ్రూపు'ను స్వాధీనం చేసుకున్నాయి.
  • ఈ స్వాధీనం ద్వారా ఎస్​బీఐ 74 శాతం వాటా, కార్లెల్​ గ్రూపు 26 శాతం వాటాను దక్కించుకున్నాయి.

ఇదీ చూడండి: 'అమెజాన్​ అసిస్టెంట్'​ సేవలు ఇక హిందీలోనూ...

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 12:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.