ETV Bharat / business

స్టేట్​ బ్యాంక్​ కొత్త చరిత్ర- క్యూ3లో రికార్డుస్థాయి లాభాలు - ఎస్​బీఐ లేటెస్ట్ అప్​డేట్​

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎస్​బీఐ భారీగా పుంజుకుంది. 2019 డిసెంబర్​తో ముగిసిన మూడు నెలల కాలంలో బ్యాంకు లాభం రూ.6,797.25 కోట్లుగా, ఆదాయం రూ.95,384.28కోట్లుగా నమోదైంది.

SBI
ఎస్​బీఐ
author img

By

Published : Jan 31, 2020, 3:40 PM IST

Updated : Feb 28, 2020, 4:13 PM IST

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం 'భారతీయ స్టేట్​ బ్యాంక్(ఎస్​బీఐ)' ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ వృద్ధి నమోదు చేసింది. 2019-20 డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 41 శాతం పెరిగి.. రూ.6,797.25 కోట్లు గడించింది. అంతకు ముందు 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎస్​బీఐ లాభం రూ.4,823.29 కోట్లుగా ఉంది.

ఎస్​బీఐ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని వెల్లడించారు బ్యాంకు అధికారులు.

ఆదాయంలో వృద్ధి ఇలా..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎస్​బీఐ ఏకీకృత ఆదాయం రూ.95,384.28 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బ్యాంక్​ ఆదాయం రూ.84,390.14 కోట్లు.

ఎన్​పీఏలు తగ్గాయ్​..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఎస్​బీఐ స్థూల ఎన్​పీఏలు, 6.94 శాతానికి, నికర ఎన్​పీఏలు 2.65 శాతానికి తగ్గాయి. అంతకు ముందు అర్థిక సంవత్సరం ఇదే సమయంలో స్థూల ఎన్​పీఏలు 8.71 శాతంగా, నికర ఎన్​పీఏలు 3.95 శాతంగా ఉన్నాయి.

ఇదీ చూడండి:ఆర్థిక సర్వే: 2020-21 ఆర్థిక సంవత్సరం ఆశాజనకమే!

Last Updated : Feb 28, 2020, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.