ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ప్రైవేటు రంగ రెండో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ తమ వినియోగదారులకు షాకిచ్చాయి. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
ఎస్బీఐలో వడ్డీ 2.70 శాతమే..
ఇప్పటికే ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు తగ్గించిన ఎస్బీఐ తాజాగా మరో 5 బేసిస్ పాయింట్ల కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో ఎస్బీఐ వినియోగదారులకు అన్ని శ్లాబుల డిపాజిట్లపై 2.70 శాతం వడ్డీ మాత్రమే లభించనుంది.
మే 31 నుంచే కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నట్లు ఎస్బీఐ తమ వెబ్సైట్లో పేర్కొంది.
ఎస్బీఐలో రూ.లక్ష లోపు, రూ. లక్ష కన్నా ఎక్కువ మొత్తం సేవింగ్స్ డిపాజిట్లతో రెండు రకాల శ్లాబులు ఉన్నాయి.
ఐసీఐసీఐ 25 బేసిస్ పాయింట్ల కోత..
సేవింగ్స్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు తగ్గించింది ఐసీఐసీఐ బ్యాంక్.
కొత్త వడ్డీ రేట్లు ఇలా..
రూ.50 లక్షల లోపు డిపాజిట్లు ఉన్న వారికి ఇప్పటి వరకు 3.25 శాతం వడ్డీ లభిస్తుండగా.. ఇకపై 3 శాతం మాత్రమే పొందనున్నారు.
రూ.50 లక్షలకు పైగా డిపాజిట్లు ఉన్న వినియోగదారులకు వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 3.50 శాతానికి తగ్గింది.
ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై తగ్గిన వడ్డీ రేట్లు గురువారం (జూన్ 4) నుంచే అమల్లోకి రానున్నాయి.
ఇదీ చూడండి:కొత్త పథంలో దేశ ఎగుమతి రథం