ప్రభుత్వ రంగ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలావధి ఎఫ్‌డీలపై 40 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. తగ్గించిన వడ్డీ రేట్లను బుధవారం (మే 27) నుంచే అమల్లోకి వస్తున్నట్లు ఆ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
దాదాపు నెల రోజుల వ్యవధిలోనే వడ్డీ రేట్లు తగ్గించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. చివరి సారిగా మే 12న వడ్డీ రేట్లను తగ్గించింది ఎస్‌బీఐ.
తాజా వడ్డీ రేట్లు ఇలా..
కాలావధి | వడ్డీ రేటు |
7 - 45 రోజులు | 2.9 శాతం |
46 - 179 రోజులు | 3.9 శాతం |
180 రోజుల నుంచి ఏడాది | 4.4 శాతం |
ఏడాది నుంచి 3 ఏళ్లు | 5.1 శాతం |
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు | 5.3 శాతం |
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు | 5.4 శాతం |
సీనియర్ సిటిజన్లకు సవరించిన వడ్డీ రేట్లకు 50 బేసిస్ పాయింట్ల అదనంగా వడ్డీ జమ చేయనున్నారు. అంటే 3 నుంచి 5 ఏళ్ల వరకు డిపాజిట్లపై 5.3 శాతం ఉండగా.. సీనియర్ సిటిజన్లకు 5.8% శాతం చెల్లించనున్నారు.
ఇదీ చూడండి:మీరు నిద్రపోవడం మర్చిపోతే యూట్యూబ్ గుర్తు చేస్తుంది!