మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసే.. 'ఎస్బీఐ కార్డ్ పే' సేవలను ప్రారంభించింది ఎస్బీఐ కార్డ్. ఈ కొత్త ఫీచర్‌తో కాంటాక్ట్ లెస్ పేమెంట్లను స్వీకరించే పాయింట్ ఆఫ్ సేల్‌ను ఉపయోగించవచ్చని పేర్కొంది. క్రెడిట్ కార్డ్‌ను భౌతికంగా వినియోగించే అవసరం లేకుండా కేవలం ఒక్క క్లిక్‌తో చెల్లింపులు చేయొచ్చని తెలిపింది.
ఎలా వాడాలంటే...
ఎస్బీఐ కార్డ్ వినియోగదారులు ఈ సదుపాయాన్ని వినియోగించేందుకు.. ముందుగా ఎస్బీఐ కార్డ్ మొబైల్ యాప్‌ను అప్డేట్ చేసుకోవాలి. తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇక పాయింట్ ఆఫ్ సేల్ డివైజ్‌కు దగ్గరలో స్మార్ట్ ఫోన్‌ను ఉంచి సులభంగా చెల్లింపులు జరపొచ్చు అని ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ హర్ దయాల్ ప్రసాద్ తెలిపారు.
డెబిట్, క్రెడిట్ కార్డుల సంస్థ 'వీసా' కార్డుపై ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు.
ఇదీ చూడండి: అదిరే ఫీచర్లతో రెడ్మీ నోట్ 8, నోట్ 8 ప్రో విడుదల