ETV Bharat / business

శాంసంగ్ గెలాక్సీ ఎస్​20 ధరలు, ప్రత్యేక ఆఫర్లు ఇవే - శాంసంగ్ ఎస్​20 ధర

శాంసంగ్​ ఇటీవల విడుదల చేసిన ఎస్​ 20 సిరీస్​ ఫోన్ల ధరలు, డెలివరీ తేదీని ప్రకటించింది. వీటితో పాటే ప్రీ బుకింగ్స్​ చేసుకునే వారికి పలు ఆఫర్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇంతకీ ఫోన్ల ధరలు, ఆఫర్లు ఏంటి? మీరూ తెలుసుకోండి.

samsung s20
శాంసంగ్ ఎస్ 20a
author img

By

Published : Feb 15, 2020, 4:01 PM IST

Updated : Mar 1, 2020, 10:32 AM IST

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్.. ఇటీవల విడుదల చేసిన ఎస్​20 సిరీస్​ మోడళ్ల ధరలను ప్రకటించింది. ఎస్​20 ప్రారంభ ధర రూ.66,999, ఎస్​20 ప్లస్​ ధర రూ.73,999, గెలాక్సీ ఎస్​20 ఆల్ట్రా ధర రూ.92,999గా నిర్ణయించినట్లు వెల్లడించింది.

ఈ మోడళ్లను అధికారిక వెబ్​సైట్​ ద్వారా ప్రీ బుకింగ్​ చేసుకోవచ్చని తెలిపింది శాంసంగ్. భారత్​లో ఎస్​20 సిరీస్​ మొబైళ్లను మార్చి 6న డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది.

గెలాక్సీ ఎస్​20 మోడల్​ను ప్రీ బుకింగ్​ చేసుకునే వినియోగదారులు.. 'గెలాక్సీ బడ్స్​ ప్లస్​' కొనుగోలు చేసే వీలుంది. బడ్స్​ప్లస్​ ధరను రూ.2,999 గా నిర్ణయించింది శాంసంగ్​. గెలాక్సీ ఎస్​20 ప్లస్​, ఎస్​20 ఆల్ట్రాలను ప్రీ బుకింగ్స్​ చేసుకునే వారికి రూ.1,999కే బడ్స్​+ను ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఎస్20 సిరీస్ ఫీచర్లు..

  • 5జీ కనెక్టివిటీ
  • ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ కెమెరా
  • ఎస్​ 20, ఎస్​ 20 ప్లస్​లలో 64 ఎంపీ కెమెరా
  • ఎస్​ 20 ఆల్ట్రాలో 108 ఎంపీ కెమెరా
  • హార్డ్​వేర్ ఆధారిత దాడుల నుంచి రక్షించే సరికొత్త, సురక్షితమైన ప్రాసెసర్

ఇదీ చూడండి:ఆన్​లైన్​లో ఆర్డర్​ చెయ్​.. ప్రత్యక్షంగా వెళ్లి కొనేయ్​!

Last Updated : Mar 1, 2020, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.