భారత ద్విచక్రవాహన దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్... 7 వేల వాహనాలను వెనక్కు పిలిపించనుంది. సంస్థ ఉత్పత్తి చేసిన బులెట్, బులెట్ ఎలక్ట్రా బైకుల్లో లోపాలు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ రెండు మోడళ్లలో 2019 మార్చ్ 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య తయారు చేసిన వాహనాల్లో 'బ్రేక్ కాలిపర్ బోల్ట్'లో సమస్యలు ఉన్నట్టు సంస్థ గుర్తించింది. దీన్ని సవరించేందుకు వినియోగదారుల నుంచి వాహనాలను వెనక్కు పిలిపించనున్నట్లు ప్రకటించింది. ఉచితంగానే ఈ సేవలు లభిస్తాయని తెలిపింది.
'బ్రేక్ కాలిపర్ బోల్ట్' అనేది బ్రేకింగ్ వ్యవస్థలో కీలకమైనది.
ఇదీ చూడండి: జోర్దార్గా అక్షయ తృతీయ పసిడి కొనుగోళ్లు