ETV Bharat / business

ప్లాస్టిక్​ వ్యర్థాలతో రోడ్లు... కేంద్రానికి రిలయన్స్​ ఆఫర్​ - రోడ్డు నిర్మాణంలో రిలయన్స్ సరికొత్త టెక్నాలజీ

పునర్వినియోగానికి వీలుకాని ప్లాస్టిక్​తో రోడ్లు నిర్మించే సాంకేతికతను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ)కి అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఎన్​హెచ్​ఏఐకి పంపింది రిలయన్స్.

ril
రోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్
author img

By

Published : Jan 29, 2020, 3:20 PM IST

Updated : Feb 28, 2020, 10:02 AM IST

ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రోడ్ల నిర్మాణానికి ఓ సరికొత్త ప్రతిపాదనను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) ముందు ఉంచింది. పునర్వినియోగానికి వీలుకాని ప్లాస్టిక్​ను రోడ్ల నిర్మాణంలో వినియోగించే సాంకేతికతను అందించేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది.

పైలట్​ ప్రాజెక్ట్​లో సత్ఫలితాలు..

ఈ కంపెనీ ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద మహారాష్ట్రలోని రాయగడ్​ జిల్లా నాగోతానేలో దాదాపు 40 కిలో మీటర్ల మేర రోడ్డును నిర్మించింది. తార్​లో కలిపిన 50 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల​ మిశ్రమాన్ని ఇందుకు వినియోగించింది.

"ప్లాస్టిక్ వ్యర్థాలైన స్నాక్స్​, ప్యాకేజింగ్ కవర్లు సహా ఇతర ప్లాస్టిక్​ వ్యర్థాలను రోడ్డు నిర్మాణంలో వాడే విధానాన్ని అభివృద్ధి చేసేందుకు మాకు 14 నుంచి 18 నెలల సమయం పట్టింది. రోడ్డు నిర్మాణాల్లో ప్లాస్టిక్ వినియోగించడంలో సహాయం చేసేందుకు మా అనుభవాన్ని ఎన్​హెచ్​ఏఐతో పంచుకుంటున్నాం."
- విపుల్ షా, రిలయన్స్ పెట్రోకెమికల్ వ్యాపారాల సీఓఓ

ఎన్​హెచ్​ఏఐతో పాటు రాష్ట్రప్రభుత్వాలు, స్థానిక సంస్థలతోనూ ఈ సాంకేతికత వినియోగంపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు విపుల్​.

ఖర్చూ తక్కువే..

పునర్వినియోగానికి వీలుకాని ఈ ప్లాస్టిక్​ను రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తే.. ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా వినియోగించడం సహా వ్యయాలు భారీగా తగ్గుతాయని రిలయన్స్ పెర్కొంది. ఈ విధానం ద్వారా దాదాపు కిలో మీటర్​ రోడ్డుకు రూ.లక్ష వరకు ఆదా అవుతుందని రిలయన్స్ పేర్కొంది.

ఇదీ చూడండి:సీతమ్మా​ ఇప్పుడే మేల్కోండి లేదంటే..!

Last Updated : Feb 28, 2020, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.