స్టాక్ మార్కెట్లలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance new record) మరో కొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.16 లక్షల కోట్లు దాటింది. గత కొన్నాళ్లుగా అతిపెద్ద లిస్టెడ్ (Biggest listed company in India) కంపెనీగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రికార్డు.. తానే బద్దలుకొడుతూ ముందుకు సాగుతోంది. కరోనా వల్ల కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నా.. స్వల్ప కాలంలోనే తేరుకుని.. ముందుకు సాగితోంది రిలయన్స్ ఇండస్ట్రీస్.
బీఎస్ఈ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) ప్రస్తుతం (Reliance M-cap) రూ.16 లక్షల కోట్ల వద్ద ఉంది.
![Mukesh Ambani, RIL Chairman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13186289_mukesh.jpg)
జీవనకాల గరిష్ఠానికి షేర్లు..
సోమవారం సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సరికొత్త రికార్డు (Reliance Share price) స్థాయికి చేరాయి. మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి సానుకూలంగా స్పందిస్తున్న సూచీలు.. మిడ్ సెషన్ తర్వాత..1.70 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. దీనితో ఒక షేరు విలువ తొలిసారి రూ.2,525పైకి చేరింది.
ఎన్ఎస్ఈలోనూ కంపెనీ షేర్లు 1.70 శాతం లాభంతో.. ఒక్కో షేరు రూ.2,525 దగ్గర్లో ట్రేడవుతోంది.
ఇదీ చదవండి: Happy Birthday google: నేడు 'గూగుల్' వార్షికోత్సవం-డూడుల్ అదుర్స్!