ETV Bharat / business

కరోనాతో ఇబ్బందులెదురైనా.. క్యూ1లో రిలయన్స్​ జోష్​

author img

By

Published : Jul 24, 2021, 6:38 AM IST

Updated : Jul 24, 2021, 6:48 AM IST

కరోనా నేపథ్యంలో పలు సవాళ్లు ఎదురైనప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంతృప్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌లో ఈ కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.12,273 కోట్లుగా నమోదైంది. రిలయన్స్​కు చెందిన ఓ2సీ, డిజిటల్‌ వ్యాపారాలు రాణించాయి.

mukesh ambani
ముకేశ్‌ అంబానీ

ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కరోనా నేపథ్యంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఏప్రిల్‌-జూన్‌కు సంతృప్తికర ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.12,273 కోట్లుగా నమోదైంది. 2020-21 ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.13,233 కోట్లతో పోలిస్తే ఇది 7.2 శాతం తక్కువ. అధిక వ్యయాలే ఇందుకు కారణం. మార్చి త్రైమాసిక లాభం రూ.10,845 కోట్లతో పోలిస్తే 13 శాతం ఎక్కువ.

ఆదాయాలు రూ.1.44 లక్షల కోట్లకు: ఏడాది వ్యవధిలో కంపెనీ ఆదాయాలు రూ.91,238 కోట్ల నుంచి రూ.1,44,372 కోట్లకు పెరిగాయి. విక్రయాలు, సేవల విలువ 57.4% అధికంగా రూ.1,58,862 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో వ్యయాలు 50% అధికమై కంపెనీ లాభాలను తటస్థీకరించినట్లయింది. పన్ను వ్యయాలు రూ.3464 కోట్లకు; మొత్తం వ్యయాలు రూ.1.31 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

75% పైగా పెరిగిన ఓ2సీ ఆదాయాలు

కంపెనీకి చెందిన చమురు-రసాయనాల (ఓ2సీ) వ్యాపార ఆదాయాలు రూ.58,906 కోట్ల నుంచి 75.2 శాతం వృద్ధితో రూ.1.03 లక్షల కోట్లకు చేరాయి. ముడిచమురు ధరకు అనుగుణంగా ఉత్పత్తి ధరలూ ప్రియం కావడం ఇందుకు ఉపకరించింది.

రిలయన్స్‌ రిటైల్‌

కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌, రిటైల్‌ విభాగంలో రెట్టింపు లాభాలొచ్చాయి. నికర లాభం 123.2% పెరిగి రూ.962 కోట్లకు చేరుకుంది. ఆదాయం 19.04% పెరిగి రూ.28,197 కోట్లుగా నమోదైంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో 123 విక్రయశాలలు జతై, మొత్తం స్టోర్ల సంఖ్య 12,803కు చేరుకుంది. మరో 700 స్టోర్లను త్వరలోనే తెరవనుంది. కొత్తగా చేరిన ఔషధ విభాగాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు.

జియో లాభాల్లో 45% వృద్ధి

జియో నికర లాభం 44.9 శాతం వృద్ధితో రూ.3651 కోట్లుగా నమోదైంది. ఆదాయాలు 9.8% పెరిగి రూ.18,952 కోట్లుగా నమోదయ్యాయి. జూన్‌ ఆఖరుకు జియో వినియోగదార్ల సంఖ్య 44.06 కోట్లకు చేరుకుంది. సగటు వినియోగదారు ఆదాయం(ఆర్పు) నెలకు రూ.138.4కు చేరుకుంది. మొత్తం డేటా ట్రాఫిక్‌ 38.5 శాతం వృద్ధితో 20.3 బిలియన్‌ జీబీలకు చేరుకుంది. పూర్తిస్థాయి 5జీ సేవలను తామే ముందు ప్రారంభిస్తామని ముకేశ్‌ మరోసారి ప్రకటించారు.

"కరోనా రెండోదశ కారణంగా సవాళ్లతో కూడిన వాతావరణాన్ని కంపెనీ ఎదుర్కొన్నా, బలమైన వృద్ధి నమోదు చేయడం సంతోషంగా ఉంది. రిలయన్స్‌కున్న వైవిధ్యభరిత వ్యాపారాలకున్న బలాన్ని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఓ2సీ వ్యాపారం బాగా రాణించింది. మా భాగస్వామి బీపీతో కలిసి కేజీ డి6లో శాటిలైట్‌ క్లస్టర్‌ను ప్రారంభించినందున ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దేశీయంగా గ్యాస్‌ ఉత్పత్తిలో 20 శాతాన్ని మేమే ఇస్తాం. జియో మరోసారి రికార్డు స్థాయి త్రైమాసిక పనితీరును ప్రదర్శించింది. కరోనా నిబంధనల వల్ల రిటైల్‌ కార్యకలాపాలు, లాభదాయకతపై ప్రభావం కనిపించింది."

- ముకేశ్‌ అంబానీ, ఛైర్మన్‌, ఎండీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

ఇదీ చూడండి: సంస్కరణలకు మూడు దశాబ్దాలు- అందరికీ అందని ఫలాలు

ఇదీ చూడండి: మొబైల్‌ బ్యాంకింగ్‌ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Last Updated : Jul 24, 2021, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.