ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలో టాప్-100 కంపెనీల జాబితాలో చేరింది. తాజాగా విడుదలైన ఫార్చూన్ గ్లోబల్-500 నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
నివేదికలోని కీలకాంశాలు..
- ఈ జాబితాలో రిలయన్స్ 10 స్థానాలు ఎగబాకి.. 96వ ర్యాంక్‌ను దక్కించుకుంది.
- నిజానికి 2012లోనే రిలయన్స్ ఈ జాబితాలో 99వ ర్యాంక్‌ను దక్కించుకుంది. అయితే 2016 నాటికి మళ్లీ 215వ ర్యాంక్‌కు పడిపోయింది.
- ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) మాత్రం ఈ సారి 34 స్థానాలు తగ్గి.. 151 ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ఓఎన్జీసీ 30 స్థానాలు తగ్గి 190 వద్దకు చేరింది.
- ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఇందులో 221వ స్థానంలో నిలిచింది. ఇంతకు ముందుతో పోలిస్తే ఎస్బీఐ 15 స్థానాలు మెరుగుపడింది.
- 2020 మార్చి 31 నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సర ఆదాయాల ఆధారంగా ఈ జాబితా రూపొందించింది ఫార్చూన్.
- 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి రిలయన్స్, ఐఓసీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ ఆదాయాలు.. వరుసగా 86.2 బిలయన్ డాలర్లు, 69.2 బిలియన్ డాలర్లు, 57 బిలియన్ డాలర్లు, 51 బిలియన్ డాలర్లుగా ఉంది.
- ఫార్చూన్ గ్లోబల్-500 జాబితాలో ఈ సారి కూడా 524 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో వాల్‌మార్ట్ అగ్రస్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి:'మైక్రోసాఫ్ట్- టిక్‌టాక్ ఒప్పందం కష్టమే'