చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ.. భారత్‌లో నేడు తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించనుంది. రియల్మీ ఎక్స్50 ప్రో 5జీ పేరుతో మార్కెట్లోకి ఈ మోడల్‌ను తీసుకురానుంది. భారత్‌తో పాటే స్పెయిన్‌లోనూ నేడే ఈ మోడల్ విడుదల కానుంది. రస్ట్ రెడ్, మోస్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి తెనుంది.
విడుదలకు ముందే 5జీ మోడల్ ఫీచర్లు కొన్ని లీక్ చేసింది రియల్మీ. ఇప్పటి వరకు లీక్ ఫీచర్లతో మార్కెట్ వర్గాల్లో రియల్మీ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. మరి రియల్మీ 5జీ స్మార్ట్‌ఫోన్ విశేషాలేంటో మీరూ చూసేయండి.
డిస్ప్లే..
90 హెచ్‌జెడ్ సూపర్ ఆమోలోడ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేను ఎక్స్50 ప్రోలో పొందుపరిచారు.
కెమెరాలు..
మొత్తం ఆరు కెమెరాలతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. అందులో నాలుగు వెనుకవైపు, రెండు ముందువైపు ఉండనున్నాయి.
వెనుకవైపు కెమెరాలు 64 మెగా పిక్సళ్లు, ఏఐ సాంకేతికతతో పనిచేయనున్నాయి. 20 ఎక్స్ జూమ్ సదుపాయం ఉండనుంది.
ముందువైపు డ్యుయల్ అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరాలను పొందుపరిచింది రియల్మీ.
ఫాస్ట్ ఛార్జింగ్..
65 వాట్ల సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం మాత్రం ఫోన్ విడుదలైన తర్వాతే తెలియనుంది.
ప్రాసెసర్..
క్వాల్కమ్ 865పై 5జీ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తేనుంది రియల్మీ. ఈ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం.
5జీ ఫోన్ ధర..
భారత మార్కెట్లో ఈ మోడల్ ధర దాదాపు రూ.50,000గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
5జీ పోటీ..
భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలకు చైనా కంపెనీలు వరుసగా సిద్ధమవుతున్నాయి. రేపే చైనాకు చెందిన మరో సంస్థ 'ఐక్యూ' 5జీ స్మార్ట్‌ఫోన్‌తో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.