ETV Bharat / business

'హెచ్​డీఎఫ్​సీ కొత్త క్రెడిట్ కార్డుల జారీ బంద్' - హెచ్​డీఎఫ్​సీ డేటా సెంటర్ సమస్యలు

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ డిజిటల్ కార్యకలాపాలు తాత్కాలికంగా ఆపాలని ఆర్​బీఐ ఆదేశించింది. కొన్నాళ్లుగా బ్యాంక్​ డేటా సెంటర్​లో అంతరాయాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్​బీఐ ఆదేశాలతో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల జారీ కూడా నిలిచిపోయింది.

HDFC Bank Digital activities Stopped
హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​పై ఆర్​బీఐ ఆంక్షలు
author img

By

Published : Dec 3, 2020, 2:45 PM IST

ప్రైవేటు రంగ బ్యాంకింగ్​ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్‌ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్​బీఐ) ఆదేశించింది. బ్యాంక్​కు చెందిన డేటా సెంటర్‌లో గత నెల చోటుచేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యలను తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఆదేశాలతో బ్యాంక్ కొత్త క్రెడిట్‌ కార్డుల జారీకి కూడా బ్రేక్‌ పడింది.

సేవల్లో అంతరాయం వల్లే..

గత రెండు సంవత్సరాలుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్​కు సంబంధించిన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నవంబర్‌ 21న బ్యాంకు ప్రైమరీ డేటా సెంటర్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవటం వల్ల ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, చెల్లింపుల్లో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్​బీఐ తాజా ఆదేశాలు జారీచేసిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వివరించింది.

పరిస్థితులు చక్కదిద్దుతున్నాం..

బ్యాంకు డిజిటల్‌ 2.0 కార్యక్రమం సహా ఇతర ఐటీ అప్లికేషన్ల పరిధిలోకి వచ్చే అన్ని కార్యకలాపాలు, నూతన క్రెడిట్‌ కార్డుల జారీని ప్రస్తుతానికి నిలిపివేయవలసిందిగా ఆర్​బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడించింది.

ఇదీ చూడండి:వరుసగా రెండో నెల సేవా రంగం సానుకూలం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.