వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరి, బావమరిదికి సింగపూర్ హైకోర్టు షాకిచ్చింది. వారికి చెందిన రూ.44.41 కోట్లు విలువైన బ్యాంకు డిపాజిట్ల లావాదేవీలను నిలిపివేయాలని ఆ దేశ బ్యాంకులను ఆదేశించింది.
పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న కారణంగా ఆయన కుటుంబ సభ్యులు విదేశాల్లో దాచుకున్న సొమ్మును జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కోరింది. ఈ విజ్ఞప్తిపై సింగపూర్ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
సింగపూర్లో ఉన్న బ్యాంకు ఖాతాలు 'పెవిలియన్ పాయింట్ కార్పొరేషన్' పేరిట ఉన్నట్లు పేర్కొంది ఈడీ. బ్రిటీష్ అధీనంలోని దీవుల్లో నీరవ్ సోదరి పూర్వి మోదీ, బావమరిది మయాంక్ మెహతా ఈ కంపెనీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
పీఎన్బీ కేసులో నీరవ్ మోదీని ఇప్పటికే లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను భారత్కు రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది.
ఇదీ చూడండి: బఫెట్ ఔదార్యం... 360 కోట్ల డాలర్ల విరాళం