డిజిటల్ వాలెట్, పేమెంట్ సంస్థలు పేటీఎం పేమెంట్ బ్యాంక్, ఫోన్‌పే ట్విట్టర్ వేదికగా పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఎస్ బ్యాంక్ లావాదేవీలపై ఆర్బీఐ పరిమితులు విధించడం ఇందుకు కారణమైంది.
అలా మొదలు...
ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పేకు లావాదేవీల సేవలను ఎస్ బ్యాంక్ అందిస్తోంది. అయితే ఎస్ బ్యాంక్ లావాదేవీలపై పరిమితులు విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఫోన్‌పే సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
దీనిపై ఫోన్‌పే ప్రత్యర్థి సంస్థ పేటీఎం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
"ప్రియమైన ఫోన్‌పే... మిమ్మల్ని పేటీఎం పేమెంట్ బ్యాంక్ యూపీఐలో చేరాలని ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం చాలా మంది పేటీఎం వాడుతున్నారు. మీ వ్యాపారం సజావుగా కొనసాగించేందుకు, విస్తరించుకునేందుకు ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి.
మీరు త్వరగా కోలుకునేలా చూస్తాం!"
-పేటీఎం ట్వీట్
-
Dear @PhonePe_ ,
— Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Inviting you to @PaytmBank #UPI platform. It already has huge adoption and can seamlessly scale manifold to handle your business.
Let’s get you back up, fast!
">Dear @PhonePe_ ,
— Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020
Inviting you to @PaytmBank #UPI platform. It already has huge adoption and can seamlessly scale manifold to handle your business.
Let’s get you back up, fast!Dear @PhonePe_ ,
— Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020
Inviting you to @PaytmBank #UPI platform. It already has huge adoption and can seamlessly scale manifold to handle your business.
Let’s get you back up, fast!
పేటీఎం ట్వీట్‌కు ఫోన్‌పే దీటుగా స్పందించింది.
"ప్రియమైన పేటీఎం.... మీ యూపీఐ ప్లాట్‌ఫాం నిజంగా అంత గొప్పదైతే మేమే మిమ్మల్ని సంప్రదించేవాళ్లం.
సుదీర్ఘ కాలంగా మాకు భాగస్వామిగా ఉన్న సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు వారిని వదిలేసి మేము మాత్రమే పుంజుకోవడంలో అర్థం లేదు. ఫామ్ ఈజ్ టెంపరరి- క్లాస్ ఈజ్ పర్మినెంట్."
-ఫోన్‌పే రిప్లై
పేటీఎం మళ్లీ స్పందిస్తూ..
"డిజిటల్ పేమెంట్స్ వినియోగదారులందరికీ అండగా ఉండేందుకు మేము సహాయం చేస్తున్నాం ఫోన్‌పే.
ఇది క్లాసీ విషయం కాదా? గుడ్‌లక్" అని ట్వీట్ చేసింది పేటీఎం.
-
Just helping @PhonePe_, we care for all digital payments users.
— Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Isn't that the classy thing to do? Goodluck! 😎👍🏻
">Just helping @PhonePe_, we care for all digital payments users.
— Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020
Isn't that the classy thing to do? Goodluck! 😎👍🏻Just helping @PhonePe_, we care for all digital payments users.
— Paytm Payments Bank (@PaytmBank) March 6, 2020
Isn't that the classy thing to do? Goodluck! 😎👍🏻
ఈ రెండు సంస్థల ట్విట్టర్ వార్‌పై ఇతర యూజర్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.
ఇదీ చూడండి:బంగారం భగభగ-రూ.45 వేలు దాటిన 10 గ్రాముల ధర