బంగారం ధర ఇవాళ మరోమారు రికార్డు స్థాయికి చేరింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు ఏకంగా రూ.773 పెరిగి.. రూ.45,343కు చేరింది.
కరోనా భయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందన్న అంచనాల నేపథ్యంలో బంగారమే సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు మదుపరులు. ఈ నేపథ్యంలో పసిడిపై పెట్టుబడులు పెరిగి ధరలు భారీగా పుంజుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటికి తోడు డాలర్‌తో రూపాయి మారకం విలువ 65 పైసలు క్షీణించి.. మారకం విలువ రూ.73.99కి చేరడమూ మరో కారణంగా చెబుతున్నారు.
వెండి ధర నేడు కిలోకు రూ.192 (దిల్లీలో) పెరిగి.. రూ.48,180కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్సు బంగారం ధర 1,678 డాలర్లుగా ఉండగా, వెండి ఔన్సుకు 17.34 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:'ఎస్ బ్యాంకు ఖాతాదారుల డబ్బు సురక్షితమే'