ఆన్లైన్ క్యాబ్ సేవల సంస్థ 'ఓలా' భారీ విస్తరణ ప్రణాళిక ప్రకటించింది. వచ్చే 12 నెలల్లోగా మరో 150 పట్టణాలకు 'ఓలా' బైక్ సేవలు విస్తరించనున్నట్లు వెల్లడించింది. 'ఓలా' ప్రస్తుతం బైక్ సేవలందిస్తున్న పట్టణాలతో పోలిస్తే ఈ సంఖ్య మూడింతలు ఎక్కువ.
ఈ విస్తరణ ద్వారా 3 లక్షల మంది బైకర్లకు ఉపాధి లభిస్తుందని 'ఓలా' మార్కెటింగ్, సేల్స్ అధిపతి అరుణ్ శ్రీనివాస్ అన్నారు. రానున్న ఏళ్లలో ఈ సంఖ్యను 10 లక్షలకు పైగా పెంచడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారాయన.
'ఓలా' బైక్ అద్దె సేవలను 2016లో ప్రారంభించింది. గురుగ్రామ్, ఫరిదాబాద్, జైపుర్లో తొలుత సేవలందించింది. ఆ తర్వాత హైదరాబాద్, చంఢీగఢ్, కోల్కతా, గయ, బికనేర్ వంటి నగరాలకు విస్తరించింది.
ఇదీ చూడండి: '5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం'