చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం హువావేకు మరో షాకిచ్చింది అమెరికా. హువావేతో ఎలాంటి వ్యాపారం నిర్వహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం స్పష్టం చేశారు.
అమెరికాలో 5జీ సేవల అందించేందుకు హువావేకు అవకాశమివ్వడం జాతీయ భద్రతకు ముప్పుగా భావిస్తూ.. ట్రంప్ పాలనా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. తమ మిత్ర దేశాలూ హువావేను నిషేధించాలని సూచించింది.
"హువావేతో మేము వాణిజ్యం చేయదలుచుకోలేదు. ప్రస్తుతం ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించడం లేదు. " - డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
హువావే సహా మరో ఐదు చైనా సంస్థల నుంచి టెలికమ్యూనికేషన్ సేవలు, ఉపకరణాల కొనుగోలుపై నిషేధం విధిస్తూ.. ఇటీవల ఓ నిబంధన తీసుకువచ్చింది అమెరికా. ఆగస్టు 13 నుంచి ఈ ఆంక్షలు అమలుకానున్నాయి.
ఇదీ చూడండి: 'ఇన్‌స్టా'లానే వాట్సాప్‌లోనూ 'బూమరాంగ్' ఫీచర్