సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ సరికొత్త కార్పొరేట్ లోగోను ఆవిష్కరించింది. ఫొటో షేరింగ్ మొదలుకొని, వర్చువల్ రియాలిటీ, డిజిటల్ కరెన్సీ వంటి విభాగాల్లోని పలు కంపెనీలకు ఫేస్బుక్ మాతృ సంస్థగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు వాటి యాప్‌లలో "ఫేస్బుక్" పేరును హైలెట్ చేస్తూ.. కొత్త లోగోను ఆవిష్కరించింది.
"ఫేస్బుక్ గ్రూప్ సంస్థలను స్పష్టంగా గుర్తించే విధంగా ఈ కొత్త లోగోను తీసుకువచ్చాం. వాట్సప్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్, వర్క్‌ప్లేస్, కాలిబ్రా సహా పలు ఇతర యాప్‌లో కొత్త లోగో 'ఫేస్బుక్'ను ప్రతిబింబిస్తుంది. - అంటోనియో లూసియో, ఫేస్బుక్ ప్రధాన మార్కెటింగ్ అధికారి
ఫేస్బుక్ ప్రయాణం..
దాదాపు 15 ఏళ్ల క్రితం సామాజిక మాధ్యమ సంస్థగా ప్రస్థానాన్ని ప్రారంభించింది ఫేస్బుక్. క్రమంగా ఎదుగుతూ.. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సహా పలు ఇతర సంస్థలను కొనుగోలు చేసి సామాజిక మాధ్యమాల్లో దిగ్గజంగా అవతరించింది. ఇప్పుడు తమకు చెందిన వేరువేరు సంస్థలను ఏకతాటిపైకి తెచ్చేందుకు లోగోల్లో మార్పులు చేసింది ఫేస్బుక్.
ఇదీ చూడండి: అంతరిక్ష పయనానికి బోయింగ్ సన్నాహాలు