ETV Bharat / business

Jet Airways: మళ్లీ ఎగరనున్న జెట్ విమానాలు

author img

By

Published : Jun 22, 2021, 5:02 PM IST

రెండేళ్లుగా కార్యకలాపాలు నిలిపేసిన జెట్​ ఎయిర్​వేస్​ మళ్లీ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. జెట్ ఎయిర్​వేస్ రుణ పరిష్కారానికి కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం దాఖలు చేసిన ప్రణాళికను ఎన్​సీఎల్​టీ ఆమోదించింది. దీంతో 30 విమానాలతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు కన్సార్షియం పేర్కొంది.

Jalan Kalrock resolution plan for Jet Airways
జెట్​ ఎయిర్​వేస్​ పున:ప్రారంభానికి కసరత్తు

సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్​వేస్​కు కాస్త ఊరట లభించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ను బిడ్డింగ్‌లో దక్కించుకున్న కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కొన్ని షరతులతో మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ విమానయాన సంస్థ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా విమానాశ్రయాల్లో స్లాట్ల కేటాయింపునకు పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ)కు ఎన్‌సీఎల్‌టీ 90 రోజుల గడువు ఇచ్చింది.

30 విమానాలతో పునఃప్రారంభం..

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ఉద్యోగులకు జెట్‌ ఎయిర్‌వేస్ చెల్లించాల్సిన రూ.12,000 కోట్లను రానున్న ఐదేళ్లలో చెల్లిస్తామని రుణ పరిష్కార ప్రక్రియలో కల్‌రాక్‌-జలాన్‌ కన్సార్షియం ప్రతిపాదించింది. జెట్‌ కార్యకలాపాలను 30 విమానాలతో తిరిగి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటికే రుణదాతల కమిటీ ఆమోదం..

రుణ ఊబిలో కూరుకుపోవడం వల్ల 2019 ఏప్రిల్‌లో కార్యకలపాలను నిలిపివేసింది జెట్‌ ఎయిర్‌వేస్‌. ప్రస్తుతం దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో ఉంది. గతేడాది అక్టోబర్లో​ బ్రిటన్‌కు చెందిన కల్‌రాక్‌ క్యాపిటల్‌, యూఏఈ వ్యాపారవేత్త జలాన్‌ల నేతృత్వంలోని కన్సార్టియం.. జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. అనంతరం సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాతల కమిటీ (సీఓసీ) ఆమోదం తెలిపింది. తాజాగా ఎన్​సీఎల్​టీ ఆమోదం కూడా లభించింది.

ఇదీ చదవండి:ప్రపంచ ట్యాబ్లెట్ మార్కెట్లో యాపిల్​, శాంసంగ్ జోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.