ETV Bharat / business

Mutual Funds: ఒక్క క్లిక్​తో.. పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారా? - ఇన్వెస్ట్​మెంట్లు

Mutual Funds: ఒకప్పుడు మ్యూచువల్‌ ఫండ్ల నుంచి డబ్బు వెనక్కి తీసుకోవడం పెద్ద ప్రక్రియ. ఫండ్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి లేదా ఏజెంటు ద్వారా దరఖాస్తు ఫారాన్ని నింపి, సమర్పించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక్క క్లిక్‌తోనే పెట్టుబడులను వెనక్కి తీసుకునే సదుపాయం వచ్చింది. కొన్నిసార్లు ఇది మనకు సౌకర్యంగానే ఉన్నా.. చాలా సందర్భాల్లో అవసరం లేకపోయినా పెట్టుబడుల ఉపసంహరణకు కారణమవుతోంది.

Mutual funds
Mutual funds
author img

By

Published : Jan 21, 2022, 8:21 AM IST

Updated : Jan 21, 2022, 10:13 AM IST

Mutual funds: మ్యూచువల్​ ఫండ్లలో పెట్టుబడులను తీసుకోవడానికి ఇప్పుడు ఒక్క క్లిక్​ చాలు. ఒకప్పుడు ఇదో పెద్ద ప్రక్రియ. సంస్థ కార్యాలయానికి వెళ్లి, దరఖాస్తు ఫారం నింపాల్సి వచ్చేది. మారిన సాంకేతికతతో ప్రక్రియ మనకు సౌకర్యంగానే ఉన్నా.. పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నామా? అవసరం లేకున్నా తీసేస్తున్నామా? ఇవి తెలుసుకోండి.

లక్ష్యాలకు చేరువగా: ప్రతి పెట్టుబడికీ ఒక గమ్యం ఉండాలి. మీరు ఫండ్లలో పెట్టుబడి ప్రారంభించినప్పుడే దీన్ని నిర్ణయించుకోవాలి. దానిని చేరుకునేంత వరకూ పెట్టుబడుల్లో ఒక్క రూపాయినీ వెనక్కి తీసుకోవద్దు. కొన్నిసార్లు మీరు అనుకున్న వ్యవధిలోపే అవసరానికి కావాల్సినంత మొత్తం జమ కావచ్చు. ఇలాంటప్పుడు మీరు పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరోవైపు.. గమ్యం మరో రెండుమూడేళ్లు ఉందనగా.. ఈక్విటీలాంటి నష్టభయం ఉన్న పథకాల నుంచి డెట్‌ పథకాల్లోకి పెట్టుబడులను మళ్లించాలి. దీనివల్ల నష్టభయం పరిమితం అవుతుంది. దీనికోసం క్రమానుగత బదిలీ విధానం (ఎస్‌టీపీ) వినియోగించుకోవాలి. సిప్‌లాగే ఇదీ మీ పెట్టుబడులను క్రమంగా ఈక్విటీల నుంచి డెట్‌కు మళ్లించేందుకు ఉపయోగపడుతుంది.

నిర్ణయాలు మారినప్పుడు..: కాలానుగుణంగా కొన్నిసార్లు లక్ష్యాలు, అవసరాలు మారుతుంటాయి. స్వల్పకాలిక అవసరం అనుకొన్నది.. దీర్ఘకాలానికి మారొచ్చు. ఇలాంటప్పుడు దానికి ముడిపెట్టిన పెట్టుబడినీ అందుకు అనుగుణంగా మార్చుకోవాలి. అంతేకానీ, అవసరం మారింది కదా అని పెట్టుబడిని వెనక్కి తీసుకోవద్దు. ఈ లక్ష్యాల ప్రకారం మీ పెట్టుబడుల కేటాయింపులూ మారాలి.

పనితీరు బాగాలేకపోతే..: ఫండ్లలో దీర్ఘకాలం మదుపు చేసినప్పుడు మంచి రాబడులకు అవకాశం ఉంటుందని నిపుణులు చెప్పే మాట. దీర్ఘకాలం కొనసాగడం ఇక్కడ లక్ష్యం కావాలి కానీ.. పనితీరు ఏమాత్రం బాగాలేని ఫండ్లలో కొనసాగాలని కాదు. కనీసం ఏడాదికోసారైనా మీ ఫండ్ల పనితీరును సమీక్షించుకుంటూ ఉండాలి. అదే విభాగంలోని మిగతా ఫండ్లతో పోల్చి చూసుకోవాలి. రాబడి ఆశించిన మేరకు రాకపోతే వెంటనే వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: Demat Nominee: డీమ్యాట్‌ ఖాతా నామినీ పేరు రాశారా?

'ఆన్​లైన్​ యాడ్స్​ కోసం కుమ్మక్కైన సుందర్​, మార్క్​​!'

Last Updated : Jan 21, 2022, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.