ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ దేవస్థానం బోర్డుకు ముకేశ్ అంబానీ కుటుంబం రూ. 5 కోట్ల విరాళం ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఆలయానికి ఏర్పడిన ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు ఈ విరాళం అందించినట్లు పేర్కొంది.
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ మొత్తాన్ని అందజేసినట్లు దేవస్థానం బోర్డు అదనపు సీఈవో బి.డి.సింగ్ బుధవారం తెలిపారు. తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు సహకరించాలని ముకేశ్ అంబానీకి విజ్ఞప్తి చేశామని.. ఇందులో భాగంగానే పెద్దమొత్తంలో విరాళం అందించారని సింగ్ వెల్లడించారు.