ఆర్బీఐ మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్షా(ఎంపీసీ) సమావేశం నేటితో ముగియనుంది. రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ కాసేపట్లో రెపో రేటును వెల్లడించనుంది.
ఆర్థిక వృద్ధి మందగమనం, ఆర్బీఐ అంచనాలకు లోబడే ద్రవ్యోల్బణం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సారీ 25 బేసిస్ పాయింట్ల రెపో కోత ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఆశించినట్లే కోత ఉంటే.. 2019-20లో రెపో తగ్గించడం వరుసగా ఇది ముడో సారి అవుతుంది.
ఏప్రిల్, జూన్ ద్వైమాసిక సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో కోత విధించింది ఆర్బీఐ. ప్రస్తుతం రెపో రేటు 5.75 శాతంగా ఉంది.
రెపో రేటుతో పాటు వెలువడే కీలక అంశాలు..
నగదు నిల్వ నిష్పత్తి (సీఆర్ఆర్)ను 50 బేసిస్ పాయింట్లు తగ్గించి.. రూ.60,000 కోట్ల నగదును వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది ఆర్బీఐ. దీనిపైనా నేడు స్పష్టత రానుంది.
ఇదీ చూడండి: సులభంగా ఐటీఆర్ దాఖలు చేయండిలా..