మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మరో ఘనత సాధించారు. 2019 ఏడాదికిగానూ 'ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ.. సాహసోపేత నిర్ణయాలు తీసుకునే 20 మంది వ్యాపారవేత్తలతో ఫార్చ్యూన్ జాబితాను వెలువరించింది. వ్యాపార ప్రపంచంలో నిశ్శబ్దమైన నాయకత్వంతో స్థిరమైన ఫలితాలు సాధించిన సత్య నాదెళ్లను.. బిజెనెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేశామని ఫార్చ్యూన్ ప్రతినిధులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఫలితాలకు సత్య నాదేళ్ల నాయకత్వ శైలే కారణమని వివరించారు.
బంగా 8, ఉల్లాల్ 18..
ఈ జాబితాలో భారత సంతతికి చెందిన మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా 8వ స్థానంలో.. అరిస్టా అధినేత జయశ్రీ ఉల్లాల్ 18వ స్థానంలో ఉన్నారు. 10 ఆర్థిక అంశాలను పరిశీలించి ఫార్చ్యూన్ ఈ జాబితాను రూపొందించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫోర్టెస్ట్ క్యూ మెటల్స్ గ్రూప్ సీఈవో ఎలిజబెత్ గెయిన్స్ రెండో స్థానంలో.. అలీబాబా సీఈవో డేనియల్ జాంగ్ 16 స్థానంలో ఉన్నారు.
ఇదీ చూడండి : ఐటీ నిపుణుల్లారా.. ఇక ఇంటికి వెళ్లండి..!