జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. దేశీయంగా ఉత్పత్తి చేసిన మొట్టమొదటి సీఎల్సీ 43 4మ్యాటిక్ కూపే మోడల్‌ను మంగళవారం విడుదల చేసింది.
సీఎల్సీ 43 4మ్యాటిక్ కూపే ఎక్స్ షోరూం ధర రూ.76.7 లక్షలుగా ప్రకటించింది మెర్సిడెస్ బెంజ్. ఈ మోడల్‌ను 3 లీటర్ల వీ6 బైడర్బో ఇంజిన్లతో తీసుకొచ్చినట్లు వెల్లడించింది. దీనికి 390 హెచ్‌పీ సామర్థ్యం ఉన్నట్లు వివరించింది.
మెర్సెడెస్ బెంజ్ దేశీయంగా ప్రస్తుతం 11 మోడళ్లను ఉత్పత్తి చేస్తోంది. పుణేలో ఉన్న ప్లాంట్ ద్వారా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తోంది బెంజ్. ఈ ప్లాంట్‌కు ఏటా 20వేల యూనిట్లను ఇన్స్టాల్ చేసే సామర్థ్యముంది. దేశంలో లగ్జరీ కార్ల విభాగంలో ఉన్న అతిపెద్ద ప్లాంట్ ఇదే కావడం గమనార్హం.
'దేశీయంగా ఉత్పతైన మొదటి ఏఎంజీ మోడల్‌ను విడుదల చేయడం మాకు ముఖ్యమైన విజయం. భారత మార్కెట్ పట్ల మాకున్న నిబద్ధత, వినియోగదారులకు మేము ఇచ్చే విలువకు ఇది నిదర్శనం.' అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ అన్నారు.
స్థానికంగా ఉత్పత్తితో బ్రాండ్‌కు మరింత ప్రజాధరణ పెరుగుతుంనది కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి:మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ ఇన్ స్మార్ట్ఫోన్లు- ధర ఎంతంటే?